కావలసిన పదార్ధాలు :
కందిపప్పు - ఒక గ్లాస్
పాల కూర -చిన్నవి ఐతే రెండు కట్టలు
చుక్క కూర - ఒక కట్ట
పచ్చి మిర్చి - రెండు
ఉల్లిపాయ - చిన్నది ఒకటి
టమోటా - ఒకటి
పసుపు కొద్దిగా
ఉప్పు తగినంత
తాలింపుకి :
వెల్లుల్లి - నాలుగు రేకులు
ఎండుమిర్చి - రెండు
కరివేపాకు - పది ఆకులు
జీల కర్ర - ఒక టీ స్పూన్
ఆవాలు - ఒక టీ స్పూన్
ఇంగువ - కొద్దిగా
నెయ్యి - రెండు టీ స్పూన్స్
తయారు చేయు విధానం : ముందుగా ఆకుకూరలు రెండూ బాగా కడిగి సన్నగా ముక్కలు కోసుకోవాలి. పప్పుని కుక్కర్లో వేసి కడిగి అందులో ఆకుకూరముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు, పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన ఆకుకూర పప్పు లో ఉప్పు వేసి గట్టిగా ఉంటే కొద్దిగా నీరు పోసి బాగా మెదపాలి. తరువాత పొయ్యి వెలిగించుకొని చిన్న బాణలి పెట్టి అందులో నెయ్యి వేసి ఒక నిమిషం తరువాత వెల్లుల్లి రేకులు, కరివేపాకు, ఎండుమిర్చి, జీల కర్ర, ఆవాలు వేసి బాగా వేగనివ్వాలి చివరగా ఇంగువ కూడా వేసి వేగనిచ్చి, పప్పులో వేసి వెంటనే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి. అంతే ఆరోగ్యం తోపాటు మంచి రుచిగా ఉండే ఆకుకూర పప్పు రెడీ!!
No comments:
Post a Comment