ఉడకపెట్టిన రొయ్యలు - అరకిలో
వరిపిండి - మూడు టేబుల్ స్పూన్స్
సెనగపిండి - రెండు టేబుల్ స్పూన్స్
కార్న్ ఫ్లౌర్ - ఒక టేబుల్ స్పూన్
మైదా -ఒక టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టీ స్పూన్
కారం - ఒక టీ స్పూన్
గరం మసాలా పొడి - ఒక టీ స్పూన్
ఉప్పు తగినంత
నీరు కలపడానికి కావలసినంత
వేయించుకోవడానికి నూనె
ముందుగా ఉడకపెట్టిన రొయ్యలకి తోకమాత్రం ఉంచి మిగిలిన తొక్క అంతా తీసేయ్యాలి. తరువాత ఒక లోతైన గిన్నెలో వరిపిండి, సెనగపిండి, కార్న్ ఫ్లోర్, మైదా, గరం మసాలాపొడి, కారం, ఉప్పు వేసి నీరుపోయ్యకుండా అన్ని బాగా కలిసేలా కలపాలి. తరువాత అల్లం వెల్లుల్లి కూడా కలిపి, నీరు పోసి బజ్జీలు ముంచి వేసేలా కలుపుకోవాలి. పొయ్యి వెలిగించి లోతుగా ఉండే బాణలి పెట్టి నూనె పోసి బాగా కాగనివ్వాలి. రొయ్యలతోక పట్టుకొని పిండి లో ముంచి కాగిన నూనెలో వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ బజ్జిలలోకి ఏదైనా మంచి చిల్లి సాస్ చాలా బాగుంటుంది.