Thursday 15 May 2008

డెక్క పిడుపు (క్రాబ్ మీట్ )




కావలసిన పదార్ధాలు :-
క్రాబ్ మీట్ - రెండు వందల గ్రాములు
ఉల్లిపాయలు- రెండు కొంచెం చిన్నవి
పచ్చిమిర్చి - రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టీ స్పూన్
కారం - ఒక టీ స్పూన్
జీలకర్ర పొడి - ఒక టీ స్పూన్
కరివేపాకు - పది ఆకులు
నూనె - రెండు టేబుల్ స్పూన్స్
కొత్తిమీర - కొద్దిగా
పసుపు-చిటికెడు
ఉప్పు తగినంత



తయారు చేయు విధానం :- ముందుగా ఉల్లిపాయలు మిక్సి లో రుబ్బుకొని, ఒక బౌల్ లోకి తీసుకొని అందులో క్రాబ్ మీట్, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, పసుపు వేసి చేతితో బాగా కలపాలి. తరువాత పొయ్య మీద బాణలి పెట్టి నూనె పోసి ఒక నిమిషం తరువాత అందులో కలిపిన ముద్ద అంతా వేసి బాగా అంటే పొడి పొడిగా వచ్చేటట్లు వేగనిచ్చి ఒక ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీర తో సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో నోరూరించే డెక్క పిడుపు రెడీ!!!!


దొండకాయ కోడిగుడ్డు వేపుడు


కావలసిన పదార్ధాలు :-

దొండకాయలు - పావు కిలో

గుడ్లు - నాలుగు

సెనగ పప్పు - రెండు టీ స్పూన్స్

మినపప్పు - రెండు టీ స్పూన్స్

వెల్లుల్లి - ఐదు లేక ఆరు రేకులు

ఎండు మిరపకాయలు-రెండు

జీలకర్ర - అర టీ స్పూన్

ఆవాలు - అర టీ స్పూన్
ఉప్పు తగినంత


కావలసిన పదార్ధాలు:- ముందుగా దొందకాయలను సన్నగా చక్రల్లగా కోసుకొని పొయ్య మీద బాణలి పెట్టి నూనె పోసి కొంచెం కాగాకా అందులో పోపు దినుసులు అన్ని వేసి బాగా వేగనివ్వాలి. తరువాత అందులో దొండకాయ ముక్కలు కూడా వేసి బాగా వేగాకా, ఉప్పు వేసి కలిపి చివరగా కోడిగుడ్లు కొట్టి అందులో వేసి బాగా అంటే పొడి పొడి గా ఉండేటట్లు వేగనిచ్చి, కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి. అంతే మీ దోడకాయ కోడిగుడ్లు రెడీ!!!