Tuesday, 20 May 2008

ముడిపెసలు మసాలా


కావలసిన పదార్ధాలు :-
ముడిపెసలు - ఒక గ్లాస్
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - రెండు
టమోటా - ఒకటి
బంగాళా దుంపలు - రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్స్
గరంమసాలా - ఒక టీ స్పూన్
కారం - ఒక టీ స్పూన్
నూనె - రెండు టేబుల్ స్పూన్స్
పసుపు - అర టీ స్పూన్
ఉప్పు తగినంత
కొత్తిమీర - సన్నగా తరిగినది (రెండు టేబుల్ స్పూన్స్)
తయారు చేయు విధానం :- ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మిక్సి లో వేసుకొని రుబ్బుకోవాలి.బంగాళా దుంపలు ఉడకపెట్టి పైన తొక్క తీసి క్రష్ చేసి పెట్టుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించుకొని బాణలి పెట్టి నూనె పోసి ఒక నిమిషం తరువాత ఉల్లిముద్ద వేసి బాగా అంటే పచ్చి వాసన పోయేవరకు వేగనిచ్చి అందులో టమేటా వేసి బాగా మగ్గనివ్వాలి. తరువాత అల్లం వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం కూడా వేసి కొద్దిగా వేగనిచ్చి ముడిపెసలు, క్రష్ చేసి పెట్టుకొన్న బంగాళా దుంపలు వేసి ఒక గ్లాస్ నీరు పోసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. పెసలు ఉడికాక అందులో గరంమసాలా వేసి భాగా కలిపి ఒక పదినిమిషాలు ఉడకనిచ్చి, కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేయ్యాలి. ఇది సాయంత్రం పూట స్నాక్ గా కూడా సర్వ్ చెయ్యొచ్చు.

చిట్కా:- పప్పులు ఏవైనా తొందరగా ఉడకాలంటే పప్పు తో పాటు ఒక టీ స్పూన్ నూనె, పసుపు వేస్తే తొందరగా ఉడుకుతుంది.