Wednesday 25 June 2008

చికెన్ మంచూరియా


కావలసిన పదార్ధాలు -

బోన్ లెస్ చికెన్ - అరకిలో

అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్స్

పసుపు - అర టీ స్పూన్

కారం - అర టీ స్పూన్

ఉప్పు తగినంత

పెరుగు - అర కప్పు

టేస్టింగ్ సాల్ట్ - చిటికెడు

కార్న్ ఫ్లౌర్ - మూడు టేబుల్ స్పూన్స్

టమాటో సాస్ - ఒక టేబుల్ స్పూన్

చిల్లి సాస్ - ఒక టీ స్పూన్

సోయా సాస్ - రెండు టీ స్పూన్స్

వెల్లుల్లి ముక్కలు - ఒక టేబుల్ స్పూన్

పచ్చిమిర్చి ముక్కలు - ఒక టీ స్పూన్

కొత్తిమీర - రెండు టేబుల్ స్పూన్స్

నూనె తగినంత

తయారుచేయు విధానం : ముందుగా చికెన్ ని సుబ్బరంగా కడిగి మీడియం సైజు లో కట్ చేసుకొని అందులో ఉప్పు కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లౌర్ , ఆల్ పర్పస్ ఫ్లౌర్, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కొద్దిగా నీరు పోసి బాగా చికెన్ అంతా కలిసేలా కలిపి ఒక గంట సేపు ఫ్రిజ్ లో పెట్టాలి. గంట తరువాత ఫ్రిజ్ లో పెట్టిన చికెన్ ని తీసి పొయ్యి వెలిగించి బాణలి పెట్టి చికెన్ ముక్కలు మునిగేలా నూనె పోసి బాగా వేడేక్కకా అందులో చికేన్ ముక్కలు వేసి బాగా కరకర లాడేలా వేపుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మల్లి పొయ్యి మీద ఇంకో బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో వేయించుకున్న చికేన్ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చిల్లి సాస్, టమాటో సాస్, సోయా సాస్, పెరుగు, టేస్టింగ్ సాల్ట్ , పెప్పెర్ కార్న్, చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసి బాగా కలిసేలా కొద్దిగా వేయించుకొని కొత్తిమీరతో చక్కగా అలంకరించుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో నోరూరించే మీ చికేన్ మంచూరియా రెడీ!!!

Wednesday 18 June 2008

రొయ్యల బజ్జీలు


ఉడకపెట్టిన రొయ్యలు - అరకిలో

వరిపిండి - మూడు టేబుల్ స్పూన్స్

సెనగపిండి - రెండు టేబుల్ స్పూన్స్

కార్న్ ఫ్లౌర్ - ఒక టేబుల్ స్పూన్

మైదా -ఒక టేబుల్ స్పూన్

అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టీ స్పూన్

కారం - ఒక టీ స్పూన్

గరం మసాలా పొడి - ఒక టీ స్పూన్

ఉప్పు తగినంత

నీరు కలపడానికి కావలసినంత

వేయించుకోవడానికి నూనె


ముందుగా ఉడకపెట్టిన రొయ్యలకి తోకమాత్రం ఉంచి మిగిలిన తొక్క అంతా తీసేయ్యాలి. తరువాత ఒక లోతైన గిన్నెలో వరిపిండి, సెనగపిండి, కార్న్ ఫ్లోర్, మైదా, గరం మసాలాపొడి, కారం, ఉప్పు వేసి నీరుపోయ్యకుండా అన్ని బాగా కలిసేలా కలపాలి. తరువాత అల్లం వెల్లుల్లి కూడా కలిపి, నీరు పోసి బజ్జీలు ముంచి వేసేలా కలుపుకోవాలి. పొయ్యి వెలిగించి లోతుగా ఉండే బాణలి పెట్టి నూనె పోసి బాగా కాగనివ్వాలి. రొయ్యలతోక పట్టుకొని పిండి లో ముంచి కాగిన నూనెలో వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ బజ్జిలలోకి ఏదైనా మంచి చిల్లి సాస్ చాలా బాగుంటుంది.

Friday 13 June 2008

చికెన్ గోంగూర


చికెన్ - అర కిలో

గోంగూర పేస్టు - రెండు కప్పులు

చుక్కకూర - ఒక కప్పు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్స్

కొత్తిమీర - ఒక కప్పు

ఉల్లిపాయలు - మూడు

ఉప్పు - తగినంత

కారం - రెండు టీ స్పూన్స్

పసుపు చిటికెడు

పచ్చిమిర్చి - రెండు

గరం మసాలా - ఒక టీ స్పూన్

నూనె - వంద గ్రాములు


చికెన్ శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి ఉంచాలి. గోంగూర, చుక్క కూర కలిపి సన్నగా కట్ చేసుకోవాలి.

ఈ రెండు కలపడం వలన కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిలో కొద్దిగా నీరు పోసి మెత్తగా ఉడకపెట్టుకొని, గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించుకొని ఒక మందపాటి బాణలిలో నూనె వేడిచేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అందులో వేసి ఎర్రగా వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేయించుకొని, చికేన్ని కూడా వేసి కలియపెట్టి మరికొద్దిసేపు వేయించుకోవాలి. రెండు గ్లాసులు నీరు పోసి పదినిమిషాలు ఉడకనిచ్చి, అందులో గోంగూర ముద్ద కూడా వేసి మరొక పదినిమిషాలు ఉడికించి, చివరిగా కొత్తిమీర, గరం మసాలా వేసి కలిపి దిన్చేయ్యాలి. అంతే ఎంతో ఇష్టపడే గోంగూర చికెన్ రెడీ!! ఇది బిరియానిలోకి, అన్నంలోకి, రొట్టేలలోకి కూడా చాలా బాగుంటుంది.

Tuesday 10 June 2008

చికెన్ బిరియాని


కావలసిన పదార్ధాలు :


బాస్మతి రైస్ - ఐదు కప్పులు
చికెన్ - అరకిలో
పచ్చిమిరపకాయలు - ఏడు
సన్నగా కోసిన ఉల్లిపాయలు - రెండు
లవంగాలు - ఆరు
సినమోన్ - ఒకటి
షాజీర (కారవే సీడ్స్ ) - అర టేబుల్ స్పూన్
బిరియాని ఆకులు - నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
కారం - అర టేబుల్ స్పూన్
ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూన్
టొమటో - ఒకటి
పెరుగు - అర టేబుల్ స్పూన్
ఎండు కొబ్బరి పొడి - ఒక టేబుల్ స్పూన్
పసుపు - అర టేబుల్ స్పూన్
ఉపు తగినంత
గరం మసాలా - అర టేబుల్ స్పూన్
చికెన్ మసాలా - అర టేబుల్ స్పూన్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు
నిమ్మకాయ - ఒకటి


తయారుచేయు విధానం : ముందుగా బియ్యం సుబ్బరంగా కడిగి, అందులో ఆరున్నర కప్పులు నీరు పోసి ఉడకనివ్వాలి. తరువాత చికెన్ ముక్కలు బాగా కడిగి అందులో కారం , పసుపు, గరం మసాలా, ఉప్పు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఒక గంట నాననివ్వాలి. తరువాత పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి ఒక నిమిషం తరువాత రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసి, అందులో సగం ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిని బాగా వేగనిచ్చి మీకు(కావాలంటే జీడిపప్పుని కూడా ఉల్లిపాయలతో వేపుకోవచ్చు) ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత కూర తయారుచేసుకోవడం కోసం బాణలిలో నాలుగు స్పూన్స్ నూనె కాని నెయ్యి కాని వేసి అందులో షాజీర ,పచ్చిమిరపకాయలు, మిగిలిన ఉల్లిపాయముక్కలు, టొమాటోలు, పసుపు వేసి వేగనివ్వాలి. బాగా వేగిన తరువాత లవంగాలు, సినమోన్, ధనియాలపొడి, ఎండుకొబ్బరి తురుము మరియౌ బిరియాని ఆకులు వేసి కొద్దిగా వేగనిచ్చి, అందులో నానపెట్టి ఉంచుకున్న చికెన్ని వేసి బాగా కలిపి అందులో కారం, ఉప్పు వేసి మూతపెట్టి పదిహేను నిమిషాల పాటు నీరంతా ఇగేరేవరకు ఉడకనిచ్చి కొత్తిమీర వేసి తరువాత స్టవ్ కట్టేయ్యాలి. మీకు కావాలంటే దీనిలో బిరియాని మసాలా కలుపుకోవచ్చు. చివరగా ఒక అల్లుమినియం ట్రే తీసుకొని దానికి నెయ్యి కాని నూనె కాని రాసి అందులో ఒక పొర అన్నం వేసి దానిమీద కూరపరుచుకొని కొత్తిమీర, కొద్దిగా కొద్దిగా నిమ్మరసం వేస్తూ, ఇదే పద్ధతిని రిపీట్ చేస్తూ ట్రే ని అల్లుమినియం ఫోయిల్ తో కవర్ చేసేయాలి. తరువాత ఒవెన్ లో 350°F వేడితో అరగంట పాటు ఉంచి దించెయ్యాలి. దీన్ని ఉడికిన కోడిగుడ్లు, కొత్తిమీర, వేయించి ఉంచిన ఉల్లిపాయలతో అందంగా అలంకరించుకొని రైతా తో వేడి వేడిగా సర్వ్ చేసుకొంటే చాలా భాగుంటుంది.

Wednesday 4 June 2008

చికెన్ తందూరీ


కావలసిన పదార్ధాలు :
బొంనే లెస్ చికెన్ - అర కిలో
పెరుగు - ఒక కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్స్
గరంమసాలా - ఒక టీ స్పూన్
తదూరి పౌడర్ - రెండు టేబుల్ స్పూన్స్
ఉప్పు తగినంత
నిమ్మరసం కొద్దిగా
నూనె వేపుకోవడానికి కావలసినంత

తయారు చేయు విధానం :- ముందుగా చికెన్ ని చిన్న చిన్న కుబ్స్ గా కట్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకొని అందులో పెరుగు, తందూరీ పౌడర్, ఉప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి ముక్కలన్నింటికి బాగా పట్టెలా కలిపి పక్కన పెట్టుకోవాలి. వీటిని కనీసం ఒక గంట సేపైనా నానపెట్టాలి. తరువాత పొయ్యి వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి బాగా కాగనిచ్చి, అందులో ఈ ముక్కలు కొంచెం కొంచెం గా వేసి బాగా క్రిస్పి గా వచ్చేటట్లు వేగనిచ్చి ప్లేట్ లోకి తీసుకోవాలి.అంతే ఇంక మీ తందూరీ రెడీ అయినట్లే.

ఒవెన్ : ఒవెన్ ని ముందుగా ఐదు నిమిషాలు వేడిచేసుకొని,దగ్గర దగ్గర 225°C వేడిలో ముక్కలన్నింటిని గ్రిల్ల్ మీద పెట్టి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ కాలనివ్వాలి.

Monday 2 June 2008

అరటికాయ పచ్చడి


కావలసిన పదార్ధాలు :

పచ్చి అరటికాయలు - రెండు
నీళ్లు - అర కప్పు
ఉప్పు తగినంత
చిలికిన పెరుగు - ఒక కప్పు

గ్రైండ్ చేసుకోవడానికి కావలసిన పదార్ధాలు :

కొబ్బరి కోరు - అర కప్పు
పచ్చిమిరపకాయలు - నాలుగు
జీల కర్ర - పావు టేబుల్ స్పూన్
వెల్లుల్లి రేకులు - రెండు
ఆవాలు - పావు టీ స్పూన్
తాలింపు కి కావలసిన పదార్ధాలు :
ఆవాలు - ఒక టీ స్పూన్
ఎండుమిరపకాయలు - మూడు
కరివేపాకు - కొద్దిగా
నూనె కావలసినంత

తయారుచేయు విధానం : ముందుగా కొబ్బరికోరు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. పొయ్యి వెలిగించి ఒక గిన్నెలో అరటికాయలను వేసి నీరుపోసి బాగా మెత్తగా ఉడకపెట్టాలి. ఉడికిన అరటికాయలను ఒక్క గరిటతో బాగా నలిపి అందులో గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి కొద్దిసేపు ఉడకనిచ్చి పొయ్యి కట్టేయ్యాలి. బాగా బీట్ చేసిన పెరుగుని పై మిశ్రమం లో కలిపి తగినంత ఉప్పుని కూడా జతచేసి పక్కన పెట్టుకోవాలి. చివరిగా మల్లి పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించుకొని అరటికాయ పచ్చడి లో కలుపుకోవాలి. ఈ పచ్చడి రైస్ తో పాటు తింటే బాగుంటుంది.


చిట్కా : పచ్చిఆవాలు గ్రైండ్ చేసుకొని వంటల్లో కలుపుకుంటే మీ వంటలు మంచి రుచిగా ఉంటాయి.