Thursday, 1 May 2008

మామిడికాయ మటన్

కావలసిన పదార్ధాలు :-
మటన్ - హల్ఫ్ కిలో
మామిడి కాయలు మంచి పుల్లగా ఉన్నవి -ఐదు
పచ్చి మిరప కాయలు - ఐదు
ఉల్లిపాయలు- రెండు
టమాటో- ఒక్కటి
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూన్
కారం - రెండు టీ స్పూన్స్
ఉప్పు తగినంత
పసుపు - హాఫ్ టీ స్పూన్
నూనె - మూడు టేబుల్ స్పూన్స్

తయారు చేయు విధానం :-
ముందుగా మటన్ కడిగి ముక్కలుగా చేసుకొని దానిలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించుకొని దానిమీద బాణలి పెట్టి నూనె పోసి ఒక్క నిమిషం తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేగనివ్వాలి. వేగిన తరువాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కోసిన మామిడికాయ ముక్కలు, టమోటా ముక్కలు, కలిపి పక్కన పెట్టుకొన్న మాంసాన్ని వేసి నీరు పోయేవరకు వేగనిచ్చి అందులో ఒక్క గ్లాస్ నీరు పొయ్యాలి. పెద్ద మంట మీద కొంచెం సేపు ఉడకనిచ్చి, మంట తగ్గించుకొని పది నిమిషాలు ఉడకనివ్వాలి. ముక్క బాగా ఉడికితే బాగుంటుంది. అంతే ఎంతో రుచిగా నోరూరించే మామిడికాయ మటన్ రెడీ !!!!!