Friday, 13 June 2008

చికెన్ గోంగూర


చికెన్ - అర కిలో

గోంగూర పేస్టు - రెండు కప్పులు

చుక్కకూర - ఒక కప్పు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్స్

కొత్తిమీర - ఒక కప్పు

ఉల్లిపాయలు - మూడు

ఉప్పు - తగినంత

కారం - రెండు టీ స్పూన్స్

పసుపు చిటికెడు

పచ్చిమిర్చి - రెండు

గరం మసాలా - ఒక టీ స్పూన్

నూనె - వంద గ్రాములు


చికెన్ శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి ఉంచాలి. గోంగూర, చుక్క కూర కలిపి సన్నగా కట్ చేసుకోవాలి.

ఈ రెండు కలపడం వలన కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిలో కొద్దిగా నీరు పోసి మెత్తగా ఉడకపెట్టుకొని, గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించుకొని ఒక మందపాటి బాణలిలో నూనె వేడిచేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అందులో వేసి ఎర్రగా వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేయించుకొని, చికేన్ని కూడా వేసి కలియపెట్టి మరికొద్దిసేపు వేయించుకోవాలి. రెండు గ్లాసులు నీరు పోసి పదినిమిషాలు ఉడకనిచ్చి, అందులో గోంగూర ముద్ద కూడా వేసి మరొక పదినిమిషాలు ఉడికించి, చివరిగా కొత్తిమీర, గరం మసాలా వేసి కలిపి దిన్చేయ్యాలి. అంతే ఎంతో ఇష్టపడే గోంగూర చికెన్ రెడీ!! ఇది బిరియానిలోకి, అన్నంలోకి, రొట్టేలలోకి కూడా చాలా బాగుంటుంది.