Saturday 12 July 2008

కీమా పరోటా


కావలసిన పదార్ధాలు :

బాగా మెత్తగా గ్రైండ్ చేసిన కీమా - పావు కిలో

గోధుమ పిండి - పావు కిలో

ఉప్పు - అర టీ స్పూన్

నూనె లేక నెయ్యి - పావు కప్పు

మసాలా పొడి - ఒక టీ స్పూన్

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్

పసుపు - పావు టీ స్పూన్


తయారు చేయు విధానం : ముందుగా కీమా లో కొద్దిగా నీరు పోసి అందులో పసుపు, ఉప్పు మరియు అల్లమ వెల్లుల్లి ముద్ద వేసి బాగా మెత్తగా నీరు మొత్తం ఇంకేవరకు ఉడకనివ్వాలి. తరువాత ఉడికిన కీమా ముద్దలో గరం మసాలా పొడి వేసి బాగా కలిపి మరొక్క సారి గ్రైండ్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. గోధుమ పిండి లో చిటికెడు ఉప్పు వేసి, కాగిన నూనె గాని నెయ్యి వేసి పూరి పిండిలా ముద్ద చేసుకొని ఒక్క గంట పక్కన పెట్టుకోవాలి. తరువాత పూరి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పరోటాలుగా పలుచగా వత్తుకోవాలి. తరువాత ఒక పరోటా తీసుకొని దానిమీద కీమా ఉండని పలుచగా పరిచి, పైన మరో పరోటా పెట్టి తడిచేత్తో అంచులు విడిపోకుండా నొక్కాలి. ఇలా పరోటాలు చేసుకొని, మామూలు పెనం మీద కొద్దిగా నూనె కాని నెయ్యి కాని వేసి రెండువైపులా కాల్చుకోవాలి. అంతే మీరు ఇష్టపడే కీమా పరోటాలు రెడీ!!

Sunday 6 July 2008

మీట్ బుల్లెట్స్ గ్రేవి


కావలసిన పదార్ధాలు :

మెత్తటి కీమా - పావు కిలో
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - మూడు
ఎండు కొబ్బరి కోరు - ఏభై గ్రాములు
కారం - రెండు టీ స్పూన్స్
పసుపు -పావు టీ స్పూన్
ధనియాలపొడి - రెండు టీ స్పూన్స్
గరం మసాల పొడి - ఒక టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్స్
పెరుగు - అర కప్పు
కరివేపాకు - పది ఆకులు
కొత్తిమీర ఒక కట్ట
నూనె - నాలుగు టేబుల్ స్పూన్స్
ఉప్పు తగినంత



తయారు చేయు విధానం : ముందుగా కీమాని సుబ్బరంగా కడిగి అందులో ఉప్పు, సగం కారం, పసుపు, ధనియాలపొడి, సగం గరం మసాల పొడి, సగం అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం కొబ్బరి కోరు వేసి బాగా కలిపి ఒక్కసారి మిక్సీలో వేసి తడి చేత్తో చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించి బాణలి పెట్టి అందులో నూనె పోసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.తరువాత నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపి పెరుగువేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిచ్చి తరువాత కీమా ఉండలను అందులో వేసి నీరంతా ఇగిరేవరకు సన్నని మంటపై ఉడకనివ్వాలి. చివరగా మిగిలిన గరం మసాలా, కొబ్బరి కోరుని కూడా అందులో వేసి ఒక గ్లాస్ నీరుపోసి సన్నని మంట మీద నూనె పైకి తేలేదాక ఉడకనిచ్చి, కొత్తిమీర తో సర్వ్ చేసుకోవాలి.

Wednesday 25 June 2008

చికెన్ మంచూరియా


కావలసిన పదార్ధాలు -

బోన్ లెస్ చికెన్ - అరకిలో

అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్స్

పసుపు - అర టీ స్పూన్

కారం - అర టీ స్పూన్

ఉప్పు తగినంత

పెరుగు - అర కప్పు

టేస్టింగ్ సాల్ట్ - చిటికెడు

కార్న్ ఫ్లౌర్ - మూడు టేబుల్ స్పూన్స్

టమాటో సాస్ - ఒక టేబుల్ స్పూన్

చిల్లి సాస్ - ఒక టీ స్పూన్

సోయా సాస్ - రెండు టీ స్పూన్స్

వెల్లుల్లి ముక్కలు - ఒక టేబుల్ స్పూన్

పచ్చిమిర్చి ముక్కలు - ఒక టీ స్పూన్

కొత్తిమీర - రెండు టేబుల్ స్పూన్స్

నూనె తగినంత

తయారుచేయు విధానం : ముందుగా చికెన్ ని సుబ్బరంగా కడిగి మీడియం సైజు లో కట్ చేసుకొని అందులో ఉప్పు కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లౌర్ , ఆల్ పర్పస్ ఫ్లౌర్, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కొద్దిగా నీరు పోసి బాగా చికెన్ అంతా కలిసేలా కలిపి ఒక గంట సేపు ఫ్రిజ్ లో పెట్టాలి. గంట తరువాత ఫ్రిజ్ లో పెట్టిన చికెన్ ని తీసి పొయ్యి వెలిగించి బాణలి పెట్టి చికెన్ ముక్కలు మునిగేలా నూనె పోసి బాగా వేడేక్కకా అందులో చికేన్ ముక్కలు వేసి బాగా కరకర లాడేలా వేపుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మల్లి పొయ్యి మీద ఇంకో బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో వేయించుకున్న చికేన్ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చిల్లి సాస్, టమాటో సాస్, సోయా సాస్, పెరుగు, టేస్టింగ్ సాల్ట్ , పెప్పెర్ కార్న్, చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసి బాగా కలిసేలా కొద్దిగా వేయించుకొని కొత్తిమీరతో చక్కగా అలంకరించుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో నోరూరించే మీ చికేన్ మంచూరియా రెడీ!!!

Wednesday 18 June 2008

రొయ్యల బజ్జీలు


ఉడకపెట్టిన రొయ్యలు - అరకిలో

వరిపిండి - మూడు టేబుల్ స్పూన్స్

సెనగపిండి - రెండు టేబుల్ స్పూన్స్

కార్న్ ఫ్లౌర్ - ఒక టేబుల్ స్పూన్

మైదా -ఒక టేబుల్ స్పూన్

అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టీ స్పూన్

కారం - ఒక టీ స్పూన్

గరం మసాలా పొడి - ఒక టీ స్పూన్

ఉప్పు తగినంత

నీరు కలపడానికి కావలసినంత

వేయించుకోవడానికి నూనె


ముందుగా ఉడకపెట్టిన రొయ్యలకి తోకమాత్రం ఉంచి మిగిలిన తొక్క అంతా తీసేయ్యాలి. తరువాత ఒక లోతైన గిన్నెలో వరిపిండి, సెనగపిండి, కార్న్ ఫ్లోర్, మైదా, గరం మసాలాపొడి, కారం, ఉప్పు వేసి నీరుపోయ్యకుండా అన్ని బాగా కలిసేలా కలపాలి. తరువాత అల్లం వెల్లుల్లి కూడా కలిపి, నీరు పోసి బజ్జీలు ముంచి వేసేలా కలుపుకోవాలి. పొయ్యి వెలిగించి లోతుగా ఉండే బాణలి పెట్టి నూనె పోసి బాగా కాగనివ్వాలి. రొయ్యలతోక పట్టుకొని పిండి లో ముంచి కాగిన నూనెలో వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ బజ్జిలలోకి ఏదైనా మంచి చిల్లి సాస్ చాలా బాగుంటుంది.

Friday 13 June 2008

చికెన్ గోంగూర


చికెన్ - అర కిలో

గోంగూర పేస్టు - రెండు కప్పులు

చుక్కకూర - ఒక కప్పు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్స్

కొత్తిమీర - ఒక కప్పు

ఉల్లిపాయలు - మూడు

ఉప్పు - తగినంత

కారం - రెండు టీ స్పూన్స్

పసుపు చిటికెడు

పచ్చిమిర్చి - రెండు

గరం మసాలా - ఒక టీ స్పూన్

నూనె - వంద గ్రాములు


చికెన్ శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి ఉంచాలి. గోంగూర, చుక్క కూర కలిపి సన్నగా కట్ చేసుకోవాలి.

ఈ రెండు కలపడం వలన కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిలో కొద్దిగా నీరు పోసి మెత్తగా ఉడకపెట్టుకొని, గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించుకొని ఒక మందపాటి బాణలిలో నూనె వేడిచేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అందులో వేసి ఎర్రగా వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేయించుకొని, చికేన్ని కూడా వేసి కలియపెట్టి మరికొద్దిసేపు వేయించుకోవాలి. రెండు గ్లాసులు నీరు పోసి పదినిమిషాలు ఉడకనిచ్చి, అందులో గోంగూర ముద్ద కూడా వేసి మరొక పదినిమిషాలు ఉడికించి, చివరిగా కొత్తిమీర, గరం మసాలా వేసి కలిపి దిన్చేయ్యాలి. అంతే ఎంతో ఇష్టపడే గోంగూర చికెన్ రెడీ!! ఇది బిరియానిలోకి, అన్నంలోకి, రొట్టేలలోకి కూడా చాలా బాగుంటుంది.

Tuesday 10 June 2008

చికెన్ బిరియాని


కావలసిన పదార్ధాలు :


బాస్మతి రైస్ - ఐదు కప్పులు
చికెన్ - అరకిలో
పచ్చిమిరపకాయలు - ఏడు
సన్నగా కోసిన ఉల్లిపాయలు - రెండు
లవంగాలు - ఆరు
సినమోన్ - ఒకటి
షాజీర (కారవే సీడ్స్ ) - అర టేబుల్ స్పూన్
బిరియాని ఆకులు - నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
కారం - అర టేబుల్ స్పూన్
ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూన్
టొమటో - ఒకటి
పెరుగు - అర టేబుల్ స్పూన్
ఎండు కొబ్బరి పొడి - ఒక టేబుల్ స్పూన్
పసుపు - అర టేబుల్ స్పూన్
ఉపు తగినంత
గరం మసాలా - అర టేబుల్ స్పూన్
చికెన్ మసాలా - అర టేబుల్ స్పూన్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు
నిమ్మకాయ - ఒకటి


తయారుచేయు విధానం : ముందుగా బియ్యం సుబ్బరంగా కడిగి, అందులో ఆరున్నర కప్పులు నీరు పోసి ఉడకనివ్వాలి. తరువాత చికెన్ ముక్కలు బాగా కడిగి అందులో కారం , పసుపు, గరం మసాలా, ఉప్పు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఒక గంట నాననివ్వాలి. తరువాత పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి ఒక నిమిషం తరువాత రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసి, అందులో సగం ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిని బాగా వేగనిచ్చి మీకు(కావాలంటే జీడిపప్పుని కూడా ఉల్లిపాయలతో వేపుకోవచ్చు) ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత కూర తయారుచేసుకోవడం కోసం బాణలిలో నాలుగు స్పూన్స్ నూనె కాని నెయ్యి కాని వేసి అందులో షాజీర ,పచ్చిమిరపకాయలు, మిగిలిన ఉల్లిపాయముక్కలు, టొమాటోలు, పసుపు వేసి వేగనివ్వాలి. బాగా వేగిన తరువాత లవంగాలు, సినమోన్, ధనియాలపొడి, ఎండుకొబ్బరి తురుము మరియౌ బిరియాని ఆకులు వేసి కొద్దిగా వేగనిచ్చి, అందులో నానపెట్టి ఉంచుకున్న చికెన్ని వేసి బాగా కలిపి అందులో కారం, ఉప్పు వేసి మూతపెట్టి పదిహేను నిమిషాల పాటు నీరంతా ఇగేరేవరకు ఉడకనిచ్చి కొత్తిమీర వేసి తరువాత స్టవ్ కట్టేయ్యాలి. మీకు కావాలంటే దీనిలో బిరియాని మసాలా కలుపుకోవచ్చు. చివరగా ఒక అల్లుమినియం ట్రే తీసుకొని దానికి నెయ్యి కాని నూనె కాని రాసి అందులో ఒక పొర అన్నం వేసి దానిమీద కూరపరుచుకొని కొత్తిమీర, కొద్దిగా కొద్దిగా నిమ్మరసం వేస్తూ, ఇదే పద్ధతిని రిపీట్ చేస్తూ ట్రే ని అల్లుమినియం ఫోయిల్ తో కవర్ చేసేయాలి. తరువాత ఒవెన్ లో 350°F వేడితో అరగంట పాటు ఉంచి దించెయ్యాలి. దీన్ని ఉడికిన కోడిగుడ్లు, కొత్తిమీర, వేయించి ఉంచిన ఉల్లిపాయలతో అందంగా అలంకరించుకొని రైతా తో వేడి వేడిగా సర్వ్ చేసుకొంటే చాలా భాగుంటుంది.

Wednesday 4 June 2008

చికెన్ తందూరీ


కావలసిన పదార్ధాలు :
బొంనే లెస్ చికెన్ - అర కిలో
పెరుగు - ఒక కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్స్
గరంమసాలా - ఒక టీ స్పూన్
తదూరి పౌడర్ - రెండు టేబుల్ స్పూన్స్
ఉప్పు తగినంత
నిమ్మరసం కొద్దిగా
నూనె వేపుకోవడానికి కావలసినంత

తయారు చేయు విధానం :- ముందుగా చికెన్ ని చిన్న చిన్న కుబ్స్ గా కట్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకొని అందులో పెరుగు, తందూరీ పౌడర్, ఉప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి ముక్కలన్నింటికి బాగా పట్టెలా కలిపి పక్కన పెట్టుకోవాలి. వీటిని కనీసం ఒక గంట సేపైనా నానపెట్టాలి. తరువాత పొయ్యి వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి బాగా కాగనిచ్చి, అందులో ఈ ముక్కలు కొంచెం కొంచెం గా వేసి బాగా క్రిస్పి గా వచ్చేటట్లు వేగనిచ్చి ప్లేట్ లోకి తీసుకోవాలి.అంతే ఇంక మీ తందూరీ రెడీ అయినట్లే.

ఒవెన్ : ఒవెన్ ని ముందుగా ఐదు నిమిషాలు వేడిచేసుకొని,దగ్గర దగ్గర 225°C వేడిలో ముక్కలన్నింటిని గ్రిల్ల్ మీద పెట్టి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ కాలనివ్వాలి.

Monday 2 June 2008

అరటికాయ పచ్చడి


కావలసిన పదార్ధాలు :

పచ్చి అరటికాయలు - రెండు
నీళ్లు - అర కప్పు
ఉప్పు తగినంత
చిలికిన పెరుగు - ఒక కప్పు

గ్రైండ్ చేసుకోవడానికి కావలసిన పదార్ధాలు :

కొబ్బరి కోరు - అర కప్పు
పచ్చిమిరపకాయలు - నాలుగు
జీల కర్ర - పావు టేబుల్ స్పూన్
వెల్లుల్లి రేకులు - రెండు
ఆవాలు - పావు టీ స్పూన్
తాలింపు కి కావలసిన పదార్ధాలు :
ఆవాలు - ఒక టీ స్పూన్
ఎండుమిరపకాయలు - మూడు
కరివేపాకు - కొద్దిగా
నూనె కావలసినంత

తయారుచేయు విధానం : ముందుగా కొబ్బరికోరు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. పొయ్యి వెలిగించి ఒక గిన్నెలో అరటికాయలను వేసి నీరుపోసి బాగా మెత్తగా ఉడకపెట్టాలి. ఉడికిన అరటికాయలను ఒక్క గరిటతో బాగా నలిపి అందులో గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి కొద్దిసేపు ఉడకనిచ్చి పొయ్యి కట్టేయ్యాలి. బాగా బీట్ చేసిన పెరుగుని పై మిశ్రమం లో కలిపి తగినంత ఉప్పుని కూడా జతచేసి పక్కన పెట్టుకోవాలి. చివరిగా మల్లి పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించుకొని అరటికాయ పచ్చడి లో కలుపుకోవాలి. ఈ పచ్చడి రైస్ తో పాటు తింటే బాగుంటుంది.


చిట్కా : పచ్చిఆవాలు గ్రైండ్ చేసుకొని వంటల్లో కలుపుకుంటే మీ వంటలు మంచి రుచిగా ఉంటాయి.

Friday 30 May 2008

హాట్ పొంగలి



కావలసిన పదార్ధాలు :
బియ్యం - ఒక గ్లాస్
పెసరపప్పు - ఒకటిన్నర గ్లాస్
పచ్చిమిర్చి - ఒకటి
మిరియాలు - పదిహేను
సెనగపప్పు - రెండు టీ స్పూన్స్
మినపప్పు - ఒక టీ స్పూన్
జీల కర్ర- అర టీ స్పూన్
ఆవాలు - అర టీ స్పూన్
కరివేపాకు - పది ఆకులు
అల్లం (తురుము) ఒక టీ స్పూన్
ఎండుమిరపకాయ - ఒకటి
జీడిపప్పు - ఏభై గ్రాములు
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్
నూనె - ఒక టేబుల్ స్పూన్
నీళ్లు - మూడు గ్లాసులు
ఉప్పు తగినంత

తయారుచేయు విధానం : ముందుగా పొయ్యి వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక నిమిషం తరువాత నూనె వేసి కొద్దిగా కాగనిచ్చిఅందులో సెనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు, అల్లం తురుము, మిరియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. తరువాత బియ్యం, పెసరపప్పు కలిపి బాగా కడిగి వేయించిన పోపులో లో వేసి కొద్దిగా అటు ఇటు వేయించుకొని ఉప్పు వేసి, నీళ్లు పోసి మూతపెట్టేయ్యాలి. రెండు మూడు విసిల్స వచ్చేవరకు ఆగి తరువాత పొయ్య కట్టేయ్యాలి. ఇది బాగా మెత్తగా ఉడికితే బాగుంటుంది. దీన్ని కొబ్బరి చట్నీ తో సర్వ్ చేస్తే బాగుంటుంది.

Monday 26 May 2008

ఆకుకూర పప్పు


కావలసిన పదార్ధాలు :
కందిపప్పు - ఒక గ్లాస్
పాల కూర -చిన్నవి ఐతే రెండు కట్టలు
చుక్క కూర - ఒక కట్ట
పచ్చి మిర్చి - రెండు
ఉల్లిపాయ - చిన్నది ఒకటి
టమోటా - ఒకటి
పసుపు కొద్దిగా
ఉప్పు తగినంత
తాలింపుకి :
వెల్లుల్లి - నాలుగు రేకులు
ఎండుమిర్చి - రెండు
కరివేపాకు - పది ఆకులు
జీల కర్ర - ఒక టీ స్పూన్
ఆవాలు - ఒక టీ స్పూన్
ఇంగువ - కొద్దిగా
నెయ్యి - రెండు టీ స్పూన్స్
తయారు చేయు విధానం : ముందుగా ఆకుకూరలు రెండూ బాగా కడిగి సన్నగా ముక్కలు కోసుకోవాలి. పప్పుని కుక్కర్లో వేసి కడిగి అందులో ఆకుకూరముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు, పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన ఆకుకూర పప్పు లో ఉప్పు వేసి గట్టిగా ఉంటే కొద్దిగా నీరు పోసి బాగా మెదపాలి. తరువాత పొయ్యి వెలిగించుకొని చిన్న బాణలి పెట్టి అందులో నెయ్యి వేసి ఒక నిమిషం తరువాత వెల్లుల్లి రేకులు, కరివేపాకు, ఎండుమిర్చి, జీల కర్ర, ఆవాలు వేసి బాగా వేగనివ్వాలి చివరగా ఇంగువ కూడా వేసి వేగనిచ్చి, పప్పులో వేసి వెంటనే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి. అంతే ఆరోగ్యం తోపాటు మంచి రుచిగా ఉండే ఆకుకూర పప్పు రెడీ!!



Thursday 22 May 2008

చికెన్ బిరియాని


కావలసిన పదార్ధాలు :-

బాస్మతి బియ్యం - అరకిలో

చికెన్ - అరకిలో

ఉల్లిపాయలు - రెండు

పచ్చిమిర్చి - రెండు

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్ స్పూన్స్

పసుపు చిటికెడు

ధనియాల పొడి - మూడు టీ స్పూన్స్

సొంపు - రెండు టీ స్పూన్స్

ఏలకులు - నాలుగు

లవంగాలు - ఆరు

దాల్చినచెక్క - రెండు

గరం మసాలా - రెండు టీ స్పూన్స్

చైనా సాల్ట్ - ఒక టీ స్పూన్

పంచదార - అర టీ స్పూన్

నిమ్మకాయ- ఒకటి

నూనె - రెండు టేబుల్ స్పూన్స్

నెయ్యు - రెండు టేబుల్ స్పూన్స్

ఉప్పు తగినంత


తయారు చేయు విధానం : ముందుగా చికెన్ ని కొంచెం పేద ముక్కలుగా కట్ చేసుకొని వాటిలో ఆక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి, ఉప్పు, పసుపు, చిటికెడు చైనా సాల్ట్ వేసి కొద్దిగా నీరు పోసి ఉడకపెట్టుకొన్న ముక్కలను ఒక ప్లేట్ లోకి తీసుకొని, అందులో మిగిన గ్రేవీ ని పక్కన పెట్టుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించుకొని కుక్కర్ పెట్టి అందులో నూనె, నెయ్యివేసి కోదిగా కాగాకా అందులో సొంపు, ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిరియాని ఆకు వేసి వేగనివ్వాలి. వేగిన మసాలా దినుసులలో సన్నగా కోసుకొన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి భాగా ఎర్రగా వేగనివ్వాలి. తరువాత అందులో మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగనిచ్చి, చికెన్, బాస్మతి బియ్యం వేసి అన్ని కలిపి కొద్దిగా వేపుకొని, అందులో లో పక్కనపెట్టుకొన్న గ్రేవీ తో పాటు నీళ్లు కలుపుకొని కొలతగా అంటే ( ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వేసి అందులో చైనా సాల్ట్, షుగర్, నిమ్మరసం వేసి మూత పెట్టి సన్న మంట మీద ఉడకనివ్వాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మీ చికెన్ బిరియాని రెడీ! మంచి కోత్తిమీరతో సర్వ్ చెయ్యండి చాలా భాగుంటుంది.

Tuesday 20 May 2008

ముడిపెసలు మసాలా


కావలసిన పదార్ధాలు :-
ముడిపెసలు - ఒక గ్లాస్
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - రెండు
టమోటా - ఒకటి
బంగాళా దుంపలు - రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్స్
గరంమసాలా - ఒక టీ స్పూన్
కారం - ఒక టీ స్పూన్
నూనె - రెండు టేబుల్ స్పూన్స్
పసుపు - అర టీ స్పూన్
ఉప్పు తగినంత
కొత్తిమీర - సన్నగా తరిగినది (రెండు టేబుల్ స్పూన్స్)
తయారు చేయు విధానం :- ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మిక్సి లో వేసుకొని రుబ్బుకోవాలి.బంగాళా దుంపలు ఉడకపెట్టి పైన తొక్క తీసి క్రష్ చేసి పెట్టుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించుకొని బాణలి పెట్టి నూనె పోసి ఒక నిమిషం తరువాత ఉల్లిముద్ద వేసి బాగా అంటే పచ్చి వాసన పోయేవరకు వేగనిచ్చి అందులో టమేటా వేసి బాగా మగ్గనివ్వాలి. తరువాత అల్లం వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం కూడా వేసి కొద్దిగా వేగనిచ్చి ముడిపెసలు, క్రష్ చేసి పెట్టుకొన్న బంగాళా దుంపలు వేసి ఒక గ్లాస్ నీరు పోసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. పెసలు ఉడికాక అందులో గరంమసాలా వేసి భాగా కలిపి ఒక పదినిమిషాలు ఉడకనిచ్చి, కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేయ్యాలి. ఇది సాయంత్రం పూట స్నాక్ గా కూడా సర్వ్ చెయ్యొచ్చు.

చిట్కా:- పప్పులు ఏవైనా తొందరగా ఉడకాలంటే పప్పు తో పాటు ఒక టీ స్పూన్ నూనె, పసుపు వేస్తే తొందరగా ఉడుకుతుంది.

Monday 19 May 2008

బేబి కార్న్ మసాల


కావలసిన పదార్ధాలు:-
బేబి కార్న్ - పది
ఉల్లిపాయలు - రెండు పెద్దవి
పచ్చి మిర్చి - రెండు
టమాటో ఒకటి పెద్దది
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్స్
గరం మసాలా - ఒక టీ స్పూన్
చైనా సాల్ట్ - పావు టీ స్పూన్
కారం - రెండు టీ స్పూన్స్
పసుపు - చిటికెడు
ఉప్పు తగినంత
కరివేపాకు - పది ఆకులు
జీల కర్ర - పావు టీ స్పూన్
ఆవాలు - పావు టీ స్పూన్
కొత్తిమీర - కొద్దిగా
నూనె - మూడు టేబుల్ స్పూన్స్
తయారు చేయు విధానం : ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో మిక్సిలో మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. పొయ్యి వెలిగించుకొని బాణలి పెట్టి అందులో నూనె వేసి ఒక నిమిషం తరువాత కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా వేగనిచ్చి అందులో రుబ్బుకున్న ఉల్లిముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఈ లోగా బేబి కార్న్ తీసుకొని వాటిని సన్నగా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేగిన ఉల్లిముద్దలో ఉప్పు, కారం, పసుపు , చైనా సాల్ట్ వేసి ఒక క్షణం వేగనిచ్చి, నీరు పోసి అందులో బేబి కార్న్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. (బేబి కార్న్ తొందరగా ఉదికిపోతాయి కాబట్టి నీరు ఎక్కువ వెయ్యకూడదు). కొద్దిగా ఉడికాక అందులో గరంమసాలా కూడా వేసి రెండునిమిశాలు ఉడకనిచ్చి, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. అంతే మీ బేబి కార్న్ మసాలా రెడీ!!!!


Saturday 17 May 2008

పీతల పులుసు


కావలసిన పదార్ధాలు :-

మంచి పీతలు - రెండు
ఉల్లిపాయలు - మూడు
పచ్చిమిర్చి - మూడు
కరివేపాకు - ఇరవై ఆకులు
వంకాయలు - రెండు చిన్నవి
బెండకాయలు - మూడు
టమోటా -ఒకటి పెద్దది
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్స్
కారం - పచ్చిమిర్చి కారంగా ఉంటే ఒక టీ స్పూన్, లేకపోతే రెండు టీ స్పూన్స్
ఉప్పు తగినంత
జీలకర్ర పొడి - ఒక టీ స్పూన్
పసుపు - పావు టీ స్పూన్
నూనె - మూడు టేబుల్ స్పూన్స్
చింత పండు - వంద గ్రాములు
కొత్తిమీర - ఒక కట్ట

తయారు చేయు విధానం :- ముందుగా పీతలు కడిగి వాటిని పెద్దవి ఐతే నాలుగు ముక్కలుగా, చిన్నవి ఐతే రెండు ముక్కలుగా చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మిక్సి లో వేసి మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించుకొని బాణలి పెట్టి అందులో నూనె పోసి ఒక నిమిషం తరువాత కరివెపాకు, ఉల్లిముద్ద, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి బాగా అంటే నూనె బైటికి వచ్చేవరకు వేగనిచ్చి, అందులో పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి వేసి కొద్దిగా వేగనిచ్చి, చింతపండు పులుసు చిక్కగా తీసుకొని అందులో వేసి, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, టమాటో ముక్కలు, పీతలు కూడా అందులో వేసి ఉడకనివ్వాలి. పులుసు చిక్కగా ఉంటే బాగుంటుంది. దించేముందు కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకొంటే పీతల పులుసు చాలా రుచిగా ఉంటుంది.



Thursday 15 May 2008

డెక్క పిడుపు (క్రాబ్ మీట్ )




కావలసిన పదార్ధాలు :-
క్రాబ్ మీట్ - రెండు వందల గ్రాములు
ఉల్లిపాయలు- రెండు కొంచెం చిన్నవి
పచ్చిమిర్చి - రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టీ స్పూన్
కారం - ఒక టీ స్పూన్
జీలకర్ర పొడి - ఒక టీ స్పూన్
కరివేపాకు - పది ఆకులు
నూనె - రెండు టేబుల్ స్పూన్స్
కొత్తిమీర - కొద్దిగా
పసుపు-చిటికెడు
ఉప్పు తగినంత



తయారు చేయు విధానం :- ముందుగా ఉల్లిపాయలు మిక్సి లో రుబ్బుకొని, ఒక బౌల్ లోకి తీసుకొని అందులో క్రాబ్ మీట్, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, పసుపు వేసి చేతితో బాగా కలపాలి. తరువాత పొయ్య మీద బాణలి పెట్టి నూనె పోసి ఒక నిమిషం తరువాత అందులో కలిపిన ముద్ద అంతా వేసి బాగా అంటే పొడి పొడిగా వచ్చేటట్లు వేగనిచ్చి ఒక ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీర తో సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో నోరూరించే డెక్క పిడుపు రెడీ!!!!


దొండకాయ కోడిగుడ్డు వేపుడు


కావలసిన పదార్ధాలు :-

దొండకాయలు - పావు కిలో

గుడ్లు - నాలుగు

సెనగ పప్పు - రెండు టీ స్పూన్స్

మినపప్పు - రెండు టీ స్పూన్స్

వెల్లుల్లి - ఐదు లేక ఆరు రేకులు

ఎండు మిరపకాయలు-రెండు

జీలకర్ర - అర టీ స్పూన్

ఆవాలు - అర టీ స్పూన్
ఉప్పు తగినంత


కావలసిన పదార్ధాలు:- ముందుగా దొందకాయలను సన్నగా చక్రల్లగా కోసుకొని పొయ్య మీద బాణలి పెట్టి నూనె పోసి కొంచెం కాగాకా అందులో పోపు దినుసులు అన్ని వేసి బాగా వేగనివ్వాలి. తరువాత అందులో దొండకాయ ముక్కలు కూడా వేసి బాగా వేగాకా, ఉప్పు వేసి కలిపి చివరగా కోడిగుడ్లు కొట్టి అందులో వేసి బాగా అంటే పొడి పొడి గా ఉండేటట్లు వేగనిచ్చి, కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి. అంతే మీ దోడకాయ కోడిగుడ్లు రెడీ!!!

Wednesday 14 May 2008

చికెన్ పకోడా



కావలసిన పదార్ధాలు:-

బియ్యపు పిండి - రెండు టేబుల్ స్పూన్స్
సెనగ పిండి - రెండు టేబుల్ స్పూన్స్
కార్న్ ఫ్లోర్ -ఒక టేబుల్
గోధుమ పిండి - ఒక టేబుల్ స్పూన్
చికెన్ (బోన్ లెస్) - పావు కిలో
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్స్
కారం - హాఫ్ టీ స్పూన్
గరం మసాలా - హాఫ్ టీ స్పూన్
ఉప్పు తగినంత
నూనె అర లీటర్
తయారు చేయు విధానం :- ముందుగా చికెన్ బాగా కడిగి చిన్న చిన్న అంటే కుబ్స్ గా కట్ చేసుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని బియ్యంపిండి, సేనగపిండి, కార్న్ ఫ్లోర్, గోధుమ పిండి వేసి అందులో ఉప్పు, కారం, గరంమసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి నీరు పోస్తూ కొంచెం జారుగా అంటే చికెన్ మునిగేలా కలుపుకోవాలి. తరువాత పొయ్య వెలిగించుకొని ఒక బాణలి పెట్టి నూనె పోసి బాగా కాగనిచ్చిఅందులో కలిపిన పిండి లో చికెన్ ముక్కలని ఒక్కొక్కటి ముంచి నూనె లో వేసి బాగా వేగనిచ్చి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవి ఇవినింగ్ స్నాక్స్ గా కాని భోజనానికి ముందు గాని సర్వ చేస్తే చాలా బాగుంటాయి.



Monday 12 May 2008

కోడిగుడ్లు అరటికాయ


తయారు చేయువిధానం:-


కోడిగుడ్లు - నాలుగు ఉడక పెట్టి ఒలిచినవి

ఉల్లిపాయలు రెండు

చెక్కిన అరటికాయలు రెండు

పచ్చి మిర్చి రెండు

కారం - ఒక టీ స్పూన్

పసుపు కొంచెం

అల్లం, వెల్లుల్లి పేస్టు - రెండు టీ స్పూన్స్

నూనె - రెండు టేబుల్ స్పూన్స్

ఆవాలు - అర టీ స్పూన్

జీల కర్ర - అర టీ స్పూన్

కరివే పాకు - పది ఆకులు


తయారు చేయు విధానం :- ముందుగా పొయ్య వెలిగించుకొని బాణలి పెట్టి అందులో నూనె పోసి కొద్దిగా వేడెక్కాక అందులో ఆవాలు, జేలకర్ర, కరివేపాకు వేసి వేగనిచ్చి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్ఛి కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఆ తరువాత అందులో అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి కొద్దిగా వేగనిచ్చి, ఉప్పు, కారం, పసుపు వేసి నీరు పోసి అందులో అరటికాయ ముక్కలు, నాట్లు పెట్టిన కోడిగుడ్లు వేసి మూత పెట్టి ఒక పావు గంట ఉడకనిచ్చి నీరంతా పోయేవరకు ఉంచి దిన్చేయ్యాలి. అంతే మీ కోడిగుడ్లు, అరటికాయ రెడీ!!!!

Wednesday 7 May 2008

రొయ్యల వేపుడు




కావలసిన పదార్ధాలు :-
రొయ్యలు - ఇరవై ఐదు
పెద్ద ఉల్లిపాయలు - మూడు
వెల్లుల్లి పెద్దది - ఒకటి
అల్లం - ఐదు
కారం - ఒకటిన్నర టేబుల్ స్పూన్
పసుపు కొంచెం
గరం మసాలా - రెండు టీ స్పూన్స్
ఏలకులు - రెండు
లవంగాలు - రెండు
కొత్తిమీర కొంచెం
కర్వేపాకు కొంచెం
నూనె - అర కప్పు
తయారు చేయు విధానం :-
ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా చేసుకొని వాటిలో అల్లం వెల్లుల్లి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వలచి, కడిగిన రొయ్యల్లో ఈ ఉల్లిముద్ద, ఉప్పు, కారం, పసుపువేసి ఒక్క హల్ఫ్ కప్ నీరు పోసి, నీరంతా ఇగిరేవరకు ఉడకనివ్వాలి. తరువాత ఒక కళాయి తీసుకొని పొయ్యిమీద పెట్టి, నూనె వేసి బాగా కాగేకా రెండు లవంగాలు, రెండు ఏలకులు కొద్దిగా కర్వేపాకు వెసి కొద్దిగా వేగనిచ్చి తరువాత ఉడకపెట్టిన రొయ్యలు కూడా వేసి ఒక పావుగంట బాగా వేగనిచ్చి చివరగా గరం మసాలా పొడి, కొత్తిమీర వేసుకొని పొయ్య ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే మీ రొయ్యల వేపుడు రెడీ!!!

Monday 5 May 2008

రొయ్యల పలావ్


కావలసిన పదార్ధాలు :-

పలావ్ బియ్యం రెండున్నర కప్పులు

మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు

మీడియం సైజ్ టొమాటోలు ఐదు లేక ఆరు

రొయ్యలు అరకిలో అంటే పెద్దవి పాతిక లేక ముప్పై

కొబ్బరికాయ ఒకటి

అల్లం, వెల్లుల్లి నూనినది ఒక టీ స్పూన్

పచ్చి మిర్చి పది

లవంగాలు ఎనిమిది, దాల్చినచెక్క ఐదు

కర్వేపాకు రెబ్బలు ఐదు, పొదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట

పసుపు ఒక టీ స్పూన్

సాల్ట్ మూడు స్పూన్స్

నెయ్యి అర కప్పు

ఇష్టమైతే జీడిపప్పు

తయారు చేయు విధానం :-

కొబ్బరిపాలు తీసి పెట్టుకోవాలి. టొమాటోలు ఉడకపెట్టి రసం తీసుకోవాలి. ఈ రెండు కలిపితే నాలుగు కప్పులు నీళ్లు అవ్వాలి. రొయ్యలు వలచి, కడిగి పెట్టాలి. అల్లం, వెల్లుల్లి మెత్తగా నూరుకోవాలి. పొదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి.

పొయ్యి మీద కుక్కర్ పెట్టి, నెయ్యి వేసి, కాగిన తరువాత మసాలా దినుసులు వేసి వేగనిచ్చి అందులో ఉల్లిపాయముక్కలు, మచ్చి మిర్చి, కరివేపాకు కూడా వేసి రెండు నిమిషాలు వేగనిచ్చి రొయ్యలు వేసి బాగా వేగాకా అందులో కొబ్బరి పాలు, టొమాటో జ్యూస్ పొయ్యాలి. ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి, ఎసరు కాగినతరువాత బియ్యం వేసి కొంచెం బాగా కలిపాకా పొదీనా, కొత్తిమీర జల్లి, వెయిట్ తో మూత పెట్టి రెండు నిమిషాలు హైయ్ లోపెట్టి, మల్ల స్లో లో ఐదు నిమిషాలు వుంచి చిన్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా నూరూరించే రొయ్యల పలావ్ రెడీ!!!!!!!

రొయ్యల పకోడా




రొయ్యల పకోడా కి కొంచం చిన్న రొయ్యలె బాగుంటాయి. ఈ రొయ్యలని శుభ్రంగా వలచి, కడిగి పెట్టుకోవాలి. అల్లం చిన్న ముక్క, పచ్చిమిర్చి నాలుగు తీసుకొని నూరుకోవాలి. ఒక గిన్నెలో మైదా పిండి, తగినంత ఉప్పు, కొద్దిగా చైనా సాల్ట్, ఈ నూరిన ముద్ద, కొద్దిగా నీరు పోసి కొద్దిగా జారుగా కలుపుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నూనె (పకోడా మునిగేలా) పోసి బాగా కాగాకా రొయ్యలు అందులో ముంచి పకోడా మాదిరిగా అందులో వేసి వేయించుకోవాలి. ఇవి భోజనానికి ముందు సర్వ్ చేయడానికి బాగుంటాయి.

Thursday 1 May 2008

మామిడికాయ మటన్

కావలసిన పదార్ధాలు :-
మటన్ - హల్ఫ్ కిలో
మామిడి కాయలు మంచి పుల్లగా ఉన్నవి -ఐదు
పచ్చి మిరప కాయలు - ఐదు
ఉల్లిపాయలు- రెండు
టమాటో- ఒక్కటి
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూన్
కారం - రెండు టీ స్పూన్స్
ఉప్పు తగినంత
పసుపు - హాఫ్ టీ స్పూన్
నూనె - మూడు టేబుల్ స్పూన్స్

తయారు చేయు విధానం :-
ముందుగా మటన్ కడిగి ముక్కలుగా చేసుకొని దానిలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించుకొని దానిమీద బాణలి పెట్టి నూనె పోసి ఒక్క నిమిషం తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేగనివ్వాలి. వేగిన తరువాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కోసిన మామిడికాయ ముక్కలు, టమోటా ముక్కలు, కలిపి పక్కన పెట్టుకొన్న మాంసాన్ని వేసి నీరు పోయేవరకు వేగనిచ్చి అందులో ఒక్క గ్లాస్ నీరు పొయ్యాలి. పెద్ద మంట మీద కొంచెం సేపు ఉడకనిచ్చి, మంట తగ్గించుకొని పది నిమిషాలు ఉడకనివ్వాలి. ముక్క బాగా ఉడికితే బాగుంటుంది. అంతే ఎంతో రుచిగా నోరూరించే మామిడికాయ మటన్ రెడీ !!!!!

Sunday 27 April 2008

కైమా కబాబ్

కావలసిన పదార్ధాలు :-
కైమా పావు కిలో
లవంగాలు మూడు
ఏలకులు రెండు
దాల్చినచెక్క రెండు
ఉల్లిపాయలు రెండు
అల్లం ఒక్క అంగుళం
గసగసాలు టీ స్పూన్
సెనగపప్పు టేబుల్ స్పూన్ (పుట్నాల పప్పు)
వెల్లుల్లి ఆరు రేకులు
కారం టీ స్పూన్
నూనె ఒక్క కప్పు
కోడిగ్రుడ్డు ఒక్కటి
పచ్చి మిర్చి రెండు
గట్టి పెరుగు అరకప్పు
తయారు చేయు విధానం :-
కైమా కడిగి, అందులో ఒక ఉల్లిపాయ కోసి, ఉప్పు, కారం, మసాలా ముద్ద ( ఎలక్కాయ, లవంగాలు, దాల్చినచెక్క, అల్లం వెల్లుల్లి )వేసి ఒక పావుగ్లాస్ నీరు పోసి నీరంతా ఇగిరేవరకు ఉడకనివ్వాలి. గసగసాలు, సెనగపప్పు తో కైమా కూడా మెత్తగా మిక్సి లో రుబ్బుకొని కోడిగ్రుడ్డు వేసి బాగా కలపాలి. పచ్చి మిర్చి, ఉల్లిపాయ సన్నగా ముక్కలు కోసుకొని, పెరుగులో కలిపి నాననివ్వాలి.(పెరుగు గట్టిగా ఉంటే మంచిది).

నూరిన కైమాని, చిన్న చిన్న ఉండలుగా చేసి దాన్ని అరచేతిలో పెట్టి కొంచెం పలుచగా చేసుకొని వాటిమీద పెరుగుతో కలిపెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఒక్క స్పూన్ వేసి దానిమీద రెండో ఉండతీసుకొని నెమ్మదిగా నొక్కుతూ అతికించాలి . తరువాత బాణలిలో నూనె పోసి బాగా కాగానిచ్చి అందులో ఒక్కటి ఒక్కటి వేసి దోరగా వేపుకోవాలి. ఇంక మీ కైమా కబాబ్ రెడీ అయినట్లే!!

Saturday 26 April 2008

చేపల వేపుడు


కావలసిన పదార్ధాలు :-
చేప కొంచెం పెద్ద సైజ్ ఒక్కటి
ఉప్పు కావలసినంత
కారం రెండు టీ స్పూన్స్
నూనె ఐదు టేబుల్ స్పూన్స్
అల్లం వెల్లుల్లి పేస్టు ఒక్క టీ స్పూన్
కొంచెం గరం మసాలా
తయారు చేయు విధానం :-
ముందు ఫిష్ ని సుబ్బరం చేసి దాన్ని అడ్డంగా కొంచే పలుచగా కోసువాలి. కోసిన చేప ముక్కలకి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, గరం మసాల వేసి కలిపి ఒక్క అరగంట పక్కన పెట్టుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించుకొని బాణలి పెట్టి నూనె వేసి రెండు నిమిషాల తరువాత అందులో ఈ చేప ముక్కలు ఒక్కొక్కటి వేసి నెమ్మదిగా కర కర లాడేలా వేపుకోవాలి. అంతే ఎంతో రుచి గా ఉండే చేపల వేపుడు రెడీ!!!!!!

మటన్ పులుసు


కావలసిన పదార్ధాలు :-
పావు కిలో మాంసం
ధనియాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్
ఉల్లిపాయలు రెండు
పది ఎండుమిరపకాయలు
ఒక్క అంగుళం అల్లం ముక్క
వెల్లుల్లి చిన్నది ఒక్కటి
ఉప్పు ఒక టేబుల్ స్పూన్
పసుపు చిటికెడు
రెండు టేబుల్ స్పూన్స్ నూనె
ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి
రెండు లవంగాలు, రెండు ఏలకులు
రెండు దాల్చినచెక్కలు

తయారు చేయు విధానం:-


ఒక్క టేబుల్ స్పూన్ నూనె వేసి మిరపకాయలు నల్లబడకుండా ధనియాలతోసహా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న సామానూ, అల్లం వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ లో నూరాలి. ఉల్లిపాయ సన్నగా తరిగిపెట్టుకొని ఒక్క పాత్ర పొయ్యి మీద పెట్టి మిగతా నూనె, నెయ్యి వేసి ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు కూడా వెయ్యాలి. దోరగా వేగాకా మాంసంవేసి ఒక్క పది నిమిషాలు నీరంతా ఇగరనిచ్చి ఈ నూరిన ముద్ద, ఉప్పు, పసుపు వేసి కలపాలి. కొంచెం సేపు వేగాకా రెండు గ్లాసులు నీరుపోసి, ముప్పావు గ్లాసు ఉందనగా దించి కొత్తిమీర వేసుకుంటే భాగుంటుంది. దీనికి నిమ్మకాయ కాని చింత పండు కాని వెయ్యకూడదు ఉంటే ఒక్క టమాటా నాలుగు ముక్కలుగా కోసి ఉల్లిపాయలతో పాటు తాలింపు లో వేస్తే బాగుంటుంది.

మటన్ ఫ్రై




కావలసిన పదార్ధాలు :-
మాంసం - పావు కిలో
నెయ్యి - ఒక్క టేబుల్ స్పూన్
నూనె - రెండు టేబుల్ స్పూన్స్
ధనియాలు - ఒక్క టేబుల్ స్పూన్
ఉప్పు - హల్ఫ్ టేబుల్ స్పూన్
ఎండు మిర్చి - ఆరు
ఉల్లిపాయలు పెద్దవి -రెండు
వెల్లుల్లి చిన్నది - ఒక్కటి
అల్లం - అంగుళం
గసగసాలు - ఒక్క టేబుల్ స్పూన్
తయారు చేయు విధానం:-
ఎలక్కాయలు, దాల్చిన చెక్క ఒట్టి బాణలిలో చిటపట లాడే వరకు వేయించి మెత్తగా పొడి కొట్టి పెట్టుకోవాలి. ధనియాలు, ఎండుమిర్చి కొంచెం నూనె వేసి వేయించుకోవాలి. ఈ వేయించుకున్నవి అల్లం-వెల్లుల్లి వేసి కొంచెం గరుగ్గా నూరుకోవాలి. ఉల్లిపాయ సన్నగా కోసి, ముక్కలు, నూరిన ముద్ద, కొంచెం పసుపు, ఉప్పు మాంసం లో వేసి ఒక్క గ్లాస్ నీరు పోసి బాగా ఉడికేవరకు ఉడకపెట్టాలి. తరువాత పోయ్యివేలింగించుకొని బాణలి పెట్టి మూడు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కాగిన తరువాత మిగిలిన ఉల్లిపాయ కోసి అందులో వేసి దొరగా వేగాకా, ఉడికిన మాంసం ముక్కలు కూడా వేసి పదినిమిషాలు వేగనిచ్చి, కొట్టి పెట్టిన మసాలా పొడి దానిమీద చల్లి ఐదు నిమిషాల పాటు వేగాకా ఒక్క బౌల్ లో తీసుకొని కోత్తిమీరతో అందంగా అలంకరించుకోవాలి . అంతే ఎంతో నోరూరించే మటన్ వేపుడు రెడీ!!!!!!!

Thursday 24 April 2008

మెంతి కూర మేక మాంసం




కావలసిన పదార్ధాలు :-
మాంసం - అరకిలో
నెయ్యి లేక నూనె - రెండు టేబుల్ స్పూన్స్
ధనియాలు - ఒక టేబుల్ స్పూన్
గసగసాలు - టేబుల్ స్పూన్
పసుపు- అర టీ స్పూన్
అల్లం - అంగుళం ముక్క
వెల్లుల్లి - పది రెబ్బలు
ఉల్లిపాయలు - రెండు
టొమాటోస్ - రెండు పెద్దవి
గరం మసాల - ఒక్క టేబుల్ స్పూన్
మంచి పెరుగు - ఒక్క కప్పు
పొదీనా - పది రెబ్బలు
కోత్తిమీర - ఒక్క కట్ట
కరివేపాకు - కొంచెం
ఉప్పు - కావలసినంత
మెంతి కూర - ఐదు గుప్పిల్లు

తయారు చేయు విధానం :- ముందుగా మెంతికూర సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక్క ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కోసుకోవాలి. టొమాటోలు మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి. గసగసాలు, గరం మసాలా, ధనియాలు, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, వెల్లుల్లి అల్లం, ఒక్క ఉల్లిపాయ, పొదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి మెత్తగా ముద్ద నూరి ఈ ముద్ద లో మాంసం , పెరుగు, మెంతికూర వేసి బాగా కలిపి ఒక్క గంట నానపెట్టాలి. పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నెయ్యి గాని నూనె గాని వేసి కాగనిచ్చి ఉల్లిముక్కలు వేసి ఎర్రగా వేగాకా అందులో కలిపి పెట్టుకున్న మాంసం వేసి, అడుగంటకుండా తిప్పుతూ దానిలో నీరంతా ఇగర నివ్వాలి . మెత్తగా చేసిపెట్టుకున్న టొమాటోలలో ఒక్క అర కప్పు నీరు పోసి, కలిపి కూరలో పోసేయ్యాలి. ఈ నీరంతా ఇగిరిన తరువాత స్టవ్ మీద నుండి దించేసి ఒక్క ప్లేట్ లోకి తీసుకొని కొంచెం కోత్తిమీరతో అందంగా అలంకరించుకోవాలి. ఈ కూర కొంచెం పుల్లగా, మెంతి కూర సువాసనతో చాల రుచిగా ఉంటుంది.




Tuesday 22 April 2008

చికెన్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్


కావలసిన పదార్ధాలు :-
బోన్ లెస్ చికెన్ - హల్ఫ్ కిలో
పచ్చి బటాని - ఒక్క కప్
ఇండియన్ బీన్స్ - రెండు కప్పులు
క్యారెట్ ముక్కలు - రెండు కప్పులు
సన్నగా తరిగిన క్యాబేజ్ - రెండు కప్పులు
ఉల్లిపాయలు - రెండు
పచ్చి మిర్చి - నాలుగు
క్యాప్సికం - ఒక్క కప్
కోడిగుడ్లు - ఆరు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక్క పెద్ద టేబుల్ స్పూన్

పసుపు చిటికెడు
నూనె - పావు కిలో
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్
సోయ సాస్ - రెండు టేబుల్ స్పూన్స్ (కొంచెం నీళ్ళల్లో కలపాలి )
సాల్ట్ తగినంత

అన్నం లోకి :-
భాస్మతి బియ్యం - ఒక్క కిలో
దాల్చిన చెక్క - అంగుళం సైజ్ రెండు
లవంగాలు - ఆరు
ఏలకులు - ఆరు
జీడి పప్పు - హల్ఫ్ కప్
చైనా సాల్ట్ - చిటికెడు
సాల్ట్ తగినంత


తయారు చేయు విధానం :- ముందుగా భాస్మతి బియ్యాన్ని బాగా కడుక్కొని అందులో నీరు పోసి దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు, చైనా సాల్ట్ , ఉప్పు, ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఉడకనివ్వాలి. ఉడికిన అన్నాన్ని ఒక్క పెద్ద గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత చికెన్ ని సుబ్బరంగా కడిగి అందులో కొద్దిగా నీరు పోసి అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు,కొద్దిగా ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఉడికిన చికెన్ ని తీసుకొని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా చిదిమి పక్కన పెట్టుకొని, పొయ్య వెలిగించి దాని మీద బాణలి పెట్టి నూనె వేసి కొంచెం వేడి అవ్వనిచ్చి అందులో కూరగాలన్ని విడి విడి గా వేపుకొని ఉడికిన రైస్ లో కలుపుకోవాలి. తరువాత బాణలి లో మల్లి నూనె పోసి అందులో చిదిమిన చికెన్ ని వేసి బాగా వేపుకొని దాన్ని కూడా రైస్ లో కలపాలి. తరువాత మల్లి బాణలిలో నూనె పోసి ఉల్లిపాయముక్కలు వేసి బాగా వేగేకా అందులో నీళ్ళల్లో కలిపిన సోయా సాస్ పోసి కొంచెం వేగనిచ్చి దాన్ని కూడా రైస్ లో కలపాలి చివరిగా మల్లి బాణలిలో నూనె పోసి అందులో కోడిగుడ్లు కొట్టి బాగా వేపుకొని దాన్ని కూడా అన్నం లో వేసి బాగా కలుపుకోవాలి. వీటన్నింటితో ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రైస్ ని బాగా కలుపుకొని కొత్తిమీర, వేపిన జీడిపప్పు తో అందంగా అలంకరించుకొని ఒక్క బౌల్ లోకి తీసుకోవాలి. ఇది తినదాకి చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి!!!!!!

పులస చేప పులుసు


కావలసిన పదార్ధాలు :-

పులస చేప - కిలో చేప

ఉల్లిపాయలు - నాలుగు మీడియం సైజ్

పచ్చిమిర్చి - నాలుగు

టమాటో - ఒక్కటి పెద్దది

వంకాయలు - చిన్నవి రెండు

బెండకాయలు - నాలుగు

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీ స్పూన్స్

జీలకర్ర పొడి - రెండు టీ స్పూన్స్


ధనియాల పొడి - రెండు టీ స్పూన్స్


గరం మసాల - హాఫ్ టీ స్పూన్

కారం - రెండు టీ స్పూన్స్

పసుపు చిటికెడు

ఉప్పు తగినంత


తయారు చేయు విధానం :- ముందుగా పులస చేపకి పొలుసు తీసి సుబ్బరం చేసుకొని మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా ముక్కలుగా కోసుకొని వాటిలో ఉప్పు, కారం, ధనియాలపొడి వేసి అన్ని ముక్కలకి పట్టెలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయలను మిక్సి లో మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. పొయ్యి వెలిగించుకొని బాణలి పెట్టి నూనె వేసుకొని ఒక్క నిమిషం తరువాత అందులో ఉల్లిముద్ధ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కొంచెం కొంచెం తరువాత అందులో చింతపండు పులుసు, చేపముక్కలు, కోసి ఉంచుకున్న బెండకాయ, వంకాయ ముక్కలు వేసి మూత పెట్టి మరగనివ్వాలి. కొంచెం చిక్కగా మరిగాకా చివరిగా కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. అంతే మీ పులస పులుసు రెడీ!!!!

Friday 18 April 2008

చీల పొట్టు మామిడికాయ ( రొయ్య పొట్టు )

కావలసిన పదార్ధాలు :-

చీల పొట్టు (రొయ్య పొట్టు ) - అరకిలో
కొంచెం లేత మామిడి కాయలు - పుల్లగా ఉన్నవి రెండు
ఉల్లిపాయ - కొంచెం పెద్దది ఒక్కటి
పచ్చిమిర్చి - నాలుగు
నూనె - రెండు టేబుల్ స్పూన్స్
కారం - ఒక్క టీ స్పూన్
పసుపు - చిటికెడు
గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర



తయారు చేయు విధానం :- ముందుగా చీల పొట్టు (రొయ్యపట్టు) ని బాగా సుబ్బరం చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించుకొని అందులో నూనె పోసి అది కాగాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా చీల్చిన పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి. తరువాత అందులో ఉప్పు కారం, పసుపు, వేసి అవి కూడా ఒక్క నిమిషం వేగాక అందులో మామిడి కాయ ముక్కలు, చీలపోట్టు వేసి కొంచెం నీరు పోసి మూతపెట్టి ఒక్క పది నిమిషాలు నీరు అంతా ఇంకేవరకు ఉడకనిచ్చి ఒక్క గిన్నెలోకి తీసుకొని కోత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే చీలపోట్టు మామిడికాయ రెడీ!!!

Tuesday 15 April 2008

కట్టచేపల ఇగురు







కట్ట చేపలు - రెండు
ఉల్లిపాయలు - మూడు కొంచెం పెద్దవి
పచ్చి మిర్చి - మూడు
అల్లం - ఒక్క అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు -నాలుగు
జీలకర్ర - ఒక్క టీ స్పూన్
నూనె -రెండు టేబుల్ స్పూన్స్
పసుపు - కొంచెం
ఉప్పు, కారం తగినంత
అందంగా అలంకరించడం కోసం కొంచెం కోతిమీర, నాలుగు పచ్చి మిరపకాయలు




తయారు చేయు విధానం :-



ముందు గా కట్టచేపలు తీసుకొని వాటిని బాగా సుబ్బరం చేసుకొని వాటిని ముక్కలుగా కోసుకొని ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఈ లోగా ఉల్లిపాయలు పెదగా ముక్కలు చేసుకొని వాటిని మిక్సి లో వేసి కొంచెం గరుగ్గా రుబ్బుకోవాలి. అలానే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర తీసుకొని వాటిని కూడా మిక్సి లో వేసి మెత్తగా పేస్టు లాగా చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక్క బాణలి పెట్టి అందులో నూనె వేసుకొని కొంచెం కాగాకా అందులో ఉల్లి ముద్ద, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపుకోవాలి. వేగిన ఉల్లి ముద్దలో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ముద్దని వేసి బాగా వేగాక అందులో కొద్దిగా నీరు వేసి కట్ట చేపల ముక్కలను కూడా అందులో వేసి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత మూత తీసేసి నీరు ఇంకవరకు అంటే బాగా దగ్గర అయ్యేవరకు ఉండనిచ్చి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. అంతే ఎంతో రుచిగా నోరూరించే కట్టచేపల ఇగురు రెడీ!!!

Tuesday 8 April 2008

యానం స్పెషల్ చీర మీను గారెలు




చీర మీను గారెలకి కావలసిన పదార్ధాలు :-
చీర మీను (సిల్వర్ ఫిష్ ) - అరకిలో
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - నాలుగు
సెనగపిండి - నాలుగు పెద్ద స్పూన్స్
కోడిగుడ్లు - రెండు
లవంగాలు -నాలుగు
ఏలకులు - రెండు
దాల్చిన చెక్క - ఒక్క అంగుళం
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక్క పెద్ద స్పూన్
కార్న్ ఫ్లౌర్ - రెండు టేబుల్ స్పూన్స్
కారం కొంచెం, ఉప్పు తగినంత

తయారు చేయు విధానం :-

ముందుగా చీరమీను బాగా కడిగి నీరు అంతా పోయేవరకు ఆగి అందులోముందుగా గ్రైండ్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి ముద్ద, పైన చెప్పిన లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క పోదిచేసుకొని ఈ చీరమీనులో వేసి, కోడిగుడ్లు అందులో వేసి కలపాలి తరువాత సెనగపిండి, కార్న్ ఫ్లౌర్, కారం, అల్లంవెల్లుల్లి పేస్టు వెసి తగినంత ఉప్పు వెసి నీరు పోయ్యకుండా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా పోయ్యమీద భానాలి పెట్టి అందులో గారెలు ములిగేలా నునే వేసుకొని భాగా వేడెక్కిన తరువాత అన్ని కలిపి పక్కన పెట్టుకున్న చీర మీను ముద్దని తీసుకొని పల్చగా గారెలు లాగా చేసుకొని తక్కువ మంటమీద కొంచెం ఎర్రగా వచ్చేలా వేపుకొని వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే ఎతో చక్కగా కరకరలాడే చీరమీను గారెలు రెడీ. ఇవి రైస్ లో సాంబార్ తో పాటు తిన్న కూడా భాగుంటాయి.