Tuesday, 10 June 2008

చికెన్ బిరియాని


కావలసిన పదార్ధాలు :


బాస్మతి రైస్ - ఐదు కప్పులు
చికెన్ - అరకిలో
పచ్చిమిరపకాయలు - ఏడు
సన్నగా కోసిన ఉల్లిపాయలు - రెండు
లవంగాలు - ఆరు
సినమోన్ - ఒకటి
షాజీర (కారవే సీడ్స్ ) - అర టేబుల్ స్పూన్
బిరియాని ఆకులు - నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
కారం - అర టేబుల్ స్పూన్
ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూన్
టొమటో - ఒకటి
పెరుగు - అర టేబుల్ స్పూన్
ఎండు కొబ్బరి పొడి - ఒక టేబుల్ స్పూన్
పసుపు - అర టేబుల్ స్పూన్
ఉపు తగినంత
గరం మసాలా - అర టేబుల్ స్పూన్
చికెన్ మసాలా - అర టేబుల్ స్పూన్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు
నిమ్మకాయ - ఒకటి


తయారుచేయు విధానం : ముందుగా బియ్యం సుబ్బరంగా కడిగి, అందులో ఆరున్నర కప్పులు నీరు పోసి ఉడకనివ్వాలి. తరువాత చికెన్ ముక్కలు బాగా కడిగి అందులో కారం , పసుపు, గరం మసాలా, ఉప్పు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఒక గంట నాననివ్వాలి. తరువాత పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి ఒక నిమిషం తరువాత రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసి, అందులో సగం ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిని బాగా వేగనిచ్చి మీకు(కావాలంటే జీడిపప్పుని కూడా ఉల్లిపాయలతో వేపుకోవచ్చు) ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత కూర తయారుచేసుకోవడం కోసం బాణలిలో నాలుగు స్పూన్స్ నూనె కాని నెయ్యి కాని వేసి అందులో షాజీర ,పచ్చిమిరపకాయలు, మిగిలిన ఉల్లిపాయముక్కలు, టొమాటోలు, పసుపు వేసి వేగనివ్వాలి. బాగా వేగిన తరువాత లవంగాలు, సినమోన్, ధనియాలపొడి, ఎండుకొబ్బరి తురుము మరియౌ బిరియాని ఆకులు వేసి కొద్దిగా వేగనిచ్చి, అందులో నానపెట్టి ఉంచుకున్న చికెన్ని వేసి బాగా కలిపి అందులో కారం, ఉప్పు వేసి మూతపెట్టి పదిహేను నిమిషాల పాటు నీరంతా ఇగేరేవరకు ఉడకనిచ్చి కొత్తిమీర వేసి తరువాత స్టవ్ కట్టేయ్యాలి. మీకు కావాలంటే దీనిలో బిరియాని మసాలా కలుపుకోవచ్చు. చివరగా ఒక అల్లుమినియం ట్రే తీసుకొని దానికి నెయ్యి కాని నూనె కాని రాసి అందులో ఒక పొర అన్నం వేసి దానిమీద కూరపరుచుకొని కొత్తిమీర, కొద్దిగా కొద్దిగా నిమ్మరసం వేస్తూ, ఇదే పద్ధతిని రిపీట్ చేస్తూ ట్రే ని అల్లుమినియం ఫోయిల్ తో కవర్ చేసేయాలి. తరువాత ఒవెన్ లో 350°F వేడితో అరగంట పాటు ఉంచి దించెయ్యాలి. దీన్ని ఉడికిన కోడిగుడ్లు, కొత్తిమీర, వేయించి ఉంచిన ఉల్లిపాయలతో అందంగా అలంకరించుకొని రైతా తో వేడి వేడిగా సర్వ్ చేసుకొంటే చాలా భాగుంటుంది.