Monday, 2 June 2008

అరటికాయ పచ్చడి


కావలసిన పదార్ధాలు :

పచ్చి అరటికాయలు - రెండు
నీళ్లు - అర కప్పు
ఉప్పు తగినంత
చిలికిన పెరుగు - ఒక కప్పు

గ్రైండ్ చేసుకోవడానికి కావలసిన పదార్ధాలు :

కొబ్బరి కోరు - అర కప్పు
పచ్చిమిరపకాయలు - నాలుగు
జీల కర్ర - పావు టేబుల్ స్పూన్
వెల్లుల్లి రేకులు - రెండు
ఆవాలు - పావు టీ స్పూన్
తాలింపు కి కావలసిన పదార్ధాలు :
ఆవాలు - ఒక టీ స్పూన్
ఎండుమిరపకాయలు - మూడు
కరివేపాకు - కొద్దిగా
నూనె కావలసినంత

తయారుచేయు విధానం : ముందుగా కొబ్బరికోరు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. పొయ్యి వెలిగించి ఒక గిన్నెలో అరటికాయలను వేసి నీరుపోసి బాగా మెత్తగా ఉడకపెట్టాలి. ఉడికిన అరటికాయలను ఒక్క గరిటతో బాగా నలిపి అందులో గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి కొద్దిసేపు ఉడకనిచ్చి పొయ్యి కట్టేయ్యాలి. బాగా బీట్ చేసిన పెరుగుని పై మిశ్రమం లో కలిపి తగినంత ఉప్పుని కూడా జతచేసి పక్కన పెట్టుకోవాలి. చివరిగా మల్లి పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించుకొని అరటికాయ పచ్చడి లో కలుపుకోవాలి. ఈ పచ్చడి రైస్ తో పాటు తింటే బాగుంటుంది.


చిట్కా : పచ్చిఆవాలు గ్రైండ్ చేసుకొని వంటల్లో కలుపుకుంటే మీ వంటలు మంచి రుచిగా ఉంటాయి.

No comments: