Monday, 5 May 2008

రొయ్యల పలావ్


కావలసిన పదార్ధాలు :-

పలావ్ బియ్యం రెండున్నర కప్పులు

మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు

మీడియం సైజ్ టొమాటోలు ఐదు లేక ఆరు

రొయ్యలు అరకిలో అంటే పెద్దవి పాతిక లేక ముప్పై

కొబ్బరికాయ ఒకటి

అల్లం, వెల్లుల్లి నూనినది ఒక టీ స్పూన్

పచ్చి మిర్చి పది

లవంగాలు ఎనిమిది, దాల్చినచెక్క ఐదు

కర్వేపాకు రెబ్బలు ఐదు, పొదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట

పసుపు ఒక టీ స్పూన్

సాల్ట్ మూడు స్పూన్స్

నెయ్యి అర కప్పు

ఇష్టమైతే జీడిపప్పు

తయారు చేయు విధానం :-

కొబ్బరిపాలు తీసి పెట్టుకోవాలి. టొమాటోలు ఉడకపెట్టి రసం తీసుకోవాలి. ఈ రెండు కలిపితే నాలుగు కప్పులు నీళ్లు అవ్వాలి. రొయ్యలు వలచి, కడిగి పెట్టాలి. అల్లం, వెల్లుల్లి మెత్తగా నూరుకోవాలి. పొదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి.

పొయ్యి మీద కుక్కర్ పెట్టి, నెయ్యి వేసి, కాగిన తరువాత మసాలా దినుసులు వేసి వేగనిచ్చి అందులో ఉల్లిపాయముక్కలు, మచ్చి మిర్చి, కరివేపాకు కూడా వేసి రెండు నిమిషాలు వేగనిచ్చి రొయ్యలు వేసి బాగా వేగాకా అందులో కొబ్బరి పాలు, టొమాటో జ్యూస్ పొయ్యాలి. ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి, ఎసరు కాగినతరువాత బియ్యం వేసి కొంచెం బాగా కలిపాకా పొదీనా, కొత్తిమీర జల్లి, వెయిట్ తో మూత పెట్టి రెండు నిమిషాలు హైయ్ లోపెట్టి, మల్ల స్లో లో ఐదు నిమిషాలు వుంచి చిన్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా నూరూరించే రొయ్యల పలావ్ రెడీ!!!!!!!

No comments: