Saturday 17 May 2008

పీతల పులుసు


కావలసిన పదార్ధాలు :-

మంచి పీతలు - రెండు
ఉల్లిపాయలు - మూడు
పచ్చిమిర్చి - మూడు
కరివేపాకు - ఇరవై ఆకులు
వంకాయలు - రెండు చిన్నవి
బెండకాయలు - మూడు
టమోటా -ఒకటి పెద్దది
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్స్
కారం - పచ్చిమిర్చి కారంగా ఉంటే ఒక టీ స్పూన్, లేకపోతే రెండు టీ స్పూన్స్
ఉప్పు తగినంత
జీలకర్ర పొడి - ఒక టీ స్పూన్
పసుపు - పావు టీ స్పూన్
నూనె - మూడు టేబుల్ స్పూన్స్
చింత పండు - వంద గ్రాములు
కొత్తిమీర - ఒక కట్ట

తయారు చేయు విధానం :- ముందుగా పీతలు కడిగి వాటిని పెద్దవి ఐతే నాలుగు ముక్కలుగా, చిన్నవి ఐతే రెండు ముక్కలుగా చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మిక్సి లో వేసి మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించుకొని బాణలి పెట్టి అందులో నూనె పోసి ఒక నిమిషం తరువాత కరివెపాకు, ఉల్లిముద్ద, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి బాగా అంటే నూనె బైటికి వచ్చేవరకు వేగనిచ్చి, అందులో పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి వేసి కొద్దిగా వేగనిచ్చి, చింతపండు పులుసు చిక్కగా తీసుకొని అందులో వేసి, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, టమాటో ముక్కలు, పీతలు కూడా అందులో వేసి ఉడకనివ్వాలి. పులుసు చిక్కగా ఉంటే బాగుంటుంది. దించేముందు కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకొంటే పీతల పులుసు చాలా రుచిగా ఉంటుంది.



No comments: